: సుబ్రహ్మణ్య స్వామిపై ఎదురు దాడి!... ప్రచారం కోసమే అనుచిత వ్యాఖ్యలంటూ వాద్రా ఫైర్!


రాజకీయ నేతలతో పాటు ఆర్థిక వేత్తలపైనా వరుస దాడులు చేస్తున్న బీజేపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామిపై ఎదురు దాడి మొదలైంది. సొంత పార్టీ నుంచే ఆయనపై మొదలైన ఈ ఎదురు దాడిలో తాజాగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా చేరిపోయారు. సూటు, బూటుతో పాటు టై కట్టుకుంటే కేంద్ర మంత్రులు వెయిటర్లుగా కనిపిస్తారన్న సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలనే ఆధారం చేసుకుని రాబర్ట్ వాద్రా సోషల్ మీడియాలో ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రులు వెయిటర్లుగా కనిపిస్తారని పేర్కొన్న స్వామి వెయిటర్లను కించపరిచినట్టేనని వాద్రా ఫేస్ బుక్ పోస్ట్ లో ఆరోపించారు. కేవలం ప్రచారం కోసమే స్వామి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని, బీజేపీ నేత వ్యవహార సరళి శోచనీయమని వాద్రా దెప్పిపొడిచారు.

  • Loading...

More Telugu News