: పెద్దమ్మ గుడిలో రేవంత్ రెడ్డి పూజలు!... మల్లన్న సాగర్ దీక్షకు పయనం!
తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారుపై పోరుకు టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలిచేందుకు రెండు రోజుల పాటు దీక్షకు దిగనున్న రేవంత్ రెడ్డి... కొద్దిసేపటి క్రితం హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి కంకణాన్ని చేతికి కట్టుకున్న రేవంత్ దీక్ష కోసం ఏటిగడ్డ కిష్టాపూర్ కు బయలుదేరారు. అంతకుముందు గుడి ఆవరణలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా మల్లన్నసాగర్ ముంపు బాధితులకు అండగా అలుపెరగని పోరు సాగిస్తానని ప్రకటించారు.