: మైనార్టీల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తాం: సీఎం చంద్రబాబు


మైనార్టీల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తామని ఏపీ సీఎ చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ముస్లింలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మత సామరస్యాన్ని కాపాడతామని చెప్పారు. విజయవాడ, కడపలో హజ్ భవనాలు నిర్మిస్తామని, ఉర్దూ భాషను ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News