: బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామితో విశాఖ శారదా పీఠాధిపతి భేటీ
ఢిల్లీలో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామితో విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి భేటీ అయ్యారు. ఇక్కడి బాలాజీ ఆలయంలో వారు సమావేశమయ్యారు. గోహత్య, రామజన్మభూమి, దేవాలయ భూముల పరిరక్షణ, గంగా ప్రక్షాళన అంశాలపై వారు చర్చించారు. కాగా, ఏపీలో దేవాలయ భూములు, సత్రం భూములు కబ్జాకు గురవుతున్నాయని, ఆ భూములను అమ్మేస్తూ కుంభకోణాలకు పాల్పడుతున్నారంటూ ఇటీవల స్వరూపానందేంద్ర స్వామి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, సదావర్తి సత్రం భూములను దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్తిగా అమ్మకానికి పెట్టిందని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే.