: ఏపీలో చేనేత పరిశ్రమల అభివృద్ధిపై పలు కీలక నిర్ణయాలు
చేనేత పరిశ్రమల అభివృద్ధిపై ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2005-2010 మధ్య నెలకొల్పిన చేనేత పరిశ్రమలకు రెండేళ్ల పాటు పారిశ్రామిక రాయితీ, 2010-2015 మధ్య నెలకొల్పిన చేనేత పరిశ్రమలకు ఐదేళ్ల పాటు పారిశ్రామిక రాయితీ, చేనేత పరిశ్రమలకు యూనిట్ కు 75 పైసలు చొప్పున విద్యుత్ రాయితీ కల్పిస్తున్నామని, చేనేత పరిశ్రమలకు విద్యుత్ రాయితీ వల్ల ప్రభుత్వంపై రూ.250 కోట్ల ఆర్థిక భారం పడుతుందని యనమల పేర్కొన్నారు.