: కంగ్రాట్స్ అనిల్ కుంబ్లే: హీరో వెంకటేష్


టీమిండియా ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లే ఎంపిక కావడంపై ప్రముఖ సినీ హీరో వెంకటేష్ స్పందించారు. ‘కంగ్రాట్స్ అనిల్ కుంబ్లే’ అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు. టీమిండియాకు హెడ్ కోచ్ గా కుంబ్లేను నియమించడం సరైన ఎంపికకు నిదర్శనమని, ‘మేక్ ఇన్ ఇండియా’ వైపు భారత్ నడుస్తోందనడానికి ఈ ఎంపిక అద్దం పడుతోందని ఆ పోస్ట్ లో వెంకటేష్ పేర్కొన్నారు. హెడ్ కోచ్ పదవికి రవిశాస్త్రి, సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాద్ లే కాకుండా టామ్ మూడీ, స్టువర్ట్ లా వంటి అనుభవజ్ఞులైన విదేశీ కోచ్ లు కూడా తలపడ్డ విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News