: ‘స్విస్ ఛాలెంజ్’ పద్ధతి మంచిది కాదని కేంద్రం నివేదికలు చెబుతున్నాయి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే


నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ‘స్విస్ ఛాలెంజ్’ పద్ధతిని అవలంబిస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే (ఆళ్ల రామకృష్ణారెడ్డి) మండిపడ్డారు. ఈ పద్ధతి మంచిది కాదని కేంద్ర ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. అయినప్పటికీ, చంద్రబాబు ఈ విధానాన్నే ఎంచుకున్నారని, తన బినామీ సంస్థలకు భూములు కట్టబెట్టడానికే బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా వెలగపూడిలో భూమి కుంగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మీడియా, అఖిల పక్షాన్ని వెలగపూడి తీసుకెళితే భూమి కుంగిన విషయాన్ని నిరూపిస్తామని అన్నారు. నిపుణులు వద్దన్న పని చేస్తూ ప్రజాధనాన్ని బాబు దుర్వినియోగం చేస్తున్నారని ఆర్కే విమర్శించారు.

  • Loading...

More Telugu News