: అత్యాచారం చేయబోయిన వ్యక్తికి తగిన శాస్తి!
కత్తితో బెదిరించి అత్యాచారం చేయబోయిన ఒక వ్యక్తి మర్మాంగాలను కోసేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో నిన్న సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంచోలి ప్రాంతంలో ఉన్న అడవిలోకి పదిహేడేళ్ల దళిత బాలిక వెళ్లడం గమనించిన రాయిస్ అనే యువకుడు ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. తన వద్ద ఉన్న కత్తితో ఆ బాలికను బెదిరించి లొంగదీసుకోవాలని చూశాడు. దీనిని తీవ్రంగా ప్రతిఘటించిన ఆ బాలిక తన శక్తినంతా కూడగట్టుకుని అతని చేతిలోని కత్తిని లాక్కుంది. మెరుపు వేగంతో అతని మర్మాంగాలను కోసి పారేసి అక్కడి నుంచి బయటపడింది. దీంతో, రాయిస్ అరుపులు కేకలు పెట్టడంతో సమీపంలో ఉన్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమాచారం పోలీసులకు తెలియజేయడంతో నిందితుడిని ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.