: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే నేనే ముఖ్యమంత్రిని!: జానారెడ్డి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా హాలియాలో ఈరోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చింది, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సీఎంతో సమాన హోదా ఉన్న ఏకైక నాయకుడిని తానేనని జానారెడ్డి చెప్పుకొచ్చారు.