: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగిన ప్రయాణికులు
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 6.50 గంటలకు ముంబయ్ కి బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానం ఇప్పటి వరకూ కదలకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టు అధికారులపై మండిపడ్డారు. విమానంలో సాంకేతిక లోపం ఏర్పడిందని, విమానం బయలుదేరడానికి ఇంకాస్త సమయం పడుతుందని ఎయిరిండియా పేర్కొంది. ప్రయాణికులను వేరే విమానంలో పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.