: మరో బాంబు పేల్చిన సుబ్రహ్మణ్యస్వామి!... నకిలీ కోటాలో కేజ్రీకి ఐఐటీ సీటు వచ్చిందట!
విపక్షాలను ముప్పు తిప్పలు పెడుతున్న బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు తాజాగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేశారు. ఐఐటీ ఖరగ్ పూర్ లో విద్యనభ్యసించిన కేజ్రీవాల్ మెరిట్ ఆధారంగా సీటు సాధించలేదని ఓ వెబ్ సైట్ ప్రచురించిన వార్తా కథనాన్ని పట్టుకుని స్వామి నేటి ఉదయం కేజ్రీపై దాడి మొదలుపెట్టారు. మెరిట్ ఆధారంగా కాకుండా నకిలీ కోటా కింద కేజ్రీవాల్ ఐఐటీ ఖరగ్ పూర్ లో సీటు సాధించారని ‘దలాట్ పాట్. కామ్’లో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ సుబ్రహ్మణ్య స్వామి నేటి ఉదయం ట్విట్టర్ లో కేజ్రీపై పోరు మొదలుపెట్టారు. ఐఐటీ ఖరగ్ పూర్ రికార్డుల్లో కేజ్రీ ర్యాంకు కార్డు లేని వైనాన్ని ఆధారం చేసుకున్న సదరు వెబ్ సైట్... కేజ్రీతో పాటు చాలా మంది విద్యార్థులకు సంబంధించిన ర్యాంకు కార్డులు లేని వైనాన్ని మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం.