: రాహుల్ గాంధీ ఎక్కడున్నారో చెబితే రూ. లక్ష బహుమతి ఇస్తామంటున్న బీజేపీ నేత
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏ దేశానికి వెళ్లారో బహిర్గతం చేయకుండా విదేశీ పర్యటన నిమిత్తం వెళ్లిన వేళ, ఆయన ఎక్కడున్నారో చెబితే రూ. లక్ష బహుమతిగా ఇస్తామంటూ మధ్యప్రదేశ్ బీజేపీ నేత బిజేంద్ర సింగ్ శిశోడియా ప్రకటించారు. ఆయన ఏదో దేశానికి వెళ్లారని, విహార యాత్రలో ఉన్నారని చెప్పిన శిశోడియా, ఆయన్ని కనిపెడితే, ఈ బహుమతి అందుకోవచ్చని పేర్కొన్నారు. గత సంవత్సరం ఆయన ఇలాగే దేశం విడిచి 50 రోజులకు పైగా గడిపారని, ఇప్పుడూ అలాంటి టూరే పెట్టుకున్నారని విమర్శించారు. ఆయన ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు? ఎలా శక్తిని కూడగట్టుకుంటున్నారు? తదితర విషయాలను తెలుసుకోవాలని ఇండియా అనుకుంటున్నట్టు వెల్లడించారు.