: పూర్తయిన కౌంటింగ్... 'బ్రెగ్జిట్' తుది ఫలితాల వివరాలు!
యూరోపియన్ యూనియన్ లో ఉండాలా? వద్దా? అన్న ప్రశ్నకు బ్రిటన్ వాసులు సమాధానం చెప్పారు. నిన్న రెఫరెండంపై ఓటింగ్ జరుగగా, అన్ని పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు పూర్తయింది. 382 లోకల్ అథారిటీస్ తమ ప్రాంత ఫలితాలను వెల్లడించాయి. బ్రెగ్జిట్ కు అనుకూలంగా 51.9 శాతం మంది, వ్యతిరేకంగా 48.1 శాతం మంది ఓట్లు వేశారు. యూనియన్ లోనే బ్రిటన్ ఉండాలని 1,61,41,241 మంది, వీడి పోవాలని 1,74,10,742 మంది కోరుకున్నారు. దీంతో 12,69,501 ఓట్ల తేడాతో బ్రెగ్జిట్ విజయం సాధించింది. ఈ ఫలితాన్ని మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు.