: ఐపీవీ వ్యాక్సినేషన్‌ను తెలంగాణ‌ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది: జేపీ న‌డ్డా


ఐపీవీ వ్యాక్సినేషన్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం యుద్ధప్రాతిపదికన పూర్తి చేసిందని హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టిస్తోన్న కేంద్ర‌మంత్రి జేపీ న‌డ్డా పేర్కొన్నారు. గోల్నాక, అంబర్‌పేటలో తెలంగాణ మంత్రి ల‌క్ష్మారెడ్డి, బీజేపీ తెలంగాణ నేత‌ కిషన్ రెడ్డితో క‌ల‌సి ఆయ‌న పోలియో నివారణ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా జేపీ న‌డ్డా మాట్లాడుతూ.. పోలియో గురించి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. పోలియో నివార‌ణ‌కు కార్య‌క్ర‌మాలు చేపట్టామ‌ని ఆయ‌న తెలిపారు. పోలియోను నివారించేందుకే ప్ర‌భుత్వం వ్యాక్సిన్ అందిస్తోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. పోలియోర‌హిత దేశంగా భార‌త్ ఉంద‌ని, భార‌త్‌లో గ‌త ఐదేళ్లుగా పోలియో కేసులు క‌నిపించిన దాఖ‌లాలు లేవ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News