: ఏపీ కేబినేట్ భేటీ ప్రారంభం
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కేబినేట్ భేటీ ప్రారంభమైంది. భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కృష్ణా జలాల వాటా, ప్రభుత్వోద్యోగాల నోటిఫికేషన్లపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. స్విస్ ఛాలెంజ్ విధానానికి, ప్రైవేటు రంగంలో వ్యవసాయ కళాశాల, వెటర్నరీ, ఉద్యాన కళాశాలల ఏర్పాటుకు అనుమతులిచ్చే ఆర్డినెన్స్‌తో పాటు పలు అంశాలకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే నేటి భేటీలో ప్రభుత్వోద్యోగులను రాజధానికి తరలించే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. అమరావతిలో ఆసుపత్రులు, పలు విద్యాసంస్థల ఏర్పాటు అంశంపై కూడా కేబినేట్ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.