: 31 ఏళ్ల కనిష్ఠానికి పౌండ్ మారకం విలువ
యూరోపియన్ యూనియన్ కూటమి నుంచి బ్రిటన్ వైదొలగాలని ప్రజలు తీర్పిస్తున్నట్టు వచ్చిన వార్తలు బ్రిటన్ కరెన్సీని చావుదెబ్బతీశాయి. పౌండ్ 31 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే డాలర్ తో పౌండ్ విలువ ఏకంగా 6 శాతం నష్టపోయి 1.3879 డాలర్లకు చేరింది. విదేశీ మారక ద్రవ్య మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఉందని వరల్డ్ ఫస్ట్ ఎకానమిస్ట్ జెర్మీ కుక్ వ్యాఖ్యానించారు. 1985 తరువాత పౌండ్ ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి.