: సైబరాబాద్ కమిషనరేట్ ను రెండుగా విభజిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు


సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ను తెలంగాణ ప్రభుత్వం రెండుగా విభజించింది. సైబరాబాద్ ఈస్ట్, సైబరాబాద్ వెస్ట్ గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నెం.126ను జారీ చేసింది. రంగారెడ్డి, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చింది. డీజీపీ విజ్ఞప్తి మేరకు సైబరాబాద్ కమిషనరేట్ కు అదనపు సిబ్బందిని కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. 346 పోలీస్, 135 మినిస్టీరియల్ స్టాఫ్, 2 వేల మంది హోంగార్డులను మంజూరు చేయడంతో పాటు 41 ఔట్ సోర్సింగ్ పోస్టులకు కూడా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • Loading...

More Telugu News