: మా అమ్మే నా కాస్ట్యూమ్ డిజైనర్: హీరోయిన్ నిహారిక


‘ఒక మనసు’ చిత్రానికి తన అమ్మే తనకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారని హీరోయిన్ నిహారిక చెప్పింది. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలో నేను ధరించిన డ్రెస్సులన్నింటినీ మా అమ్మే డిజైన్ చేశారు. దీంతో, చాలా కంఫర్ట్ ఫీలయ్యాను. ‘ఒక మనసు’ చిత్రం షూటింగ్ సమయంలోను, డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అమ్మ నాతోనే ఉంది. ఈ చిత్రం రషెస్ చూడమని మా నాన్నతో చెపితే... చిన్నపిల్లాడిలాగా నేను సగం సగం చూడను, మొత్తం చూస్తానన్నారు. ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్ తో వచ్చినవారెవరూ నిరాశ చెందరు. సినిమా చూసిన తర్వాత చాలా మంచి ఫీల్ తో ప్రేక్షకులు బయటకు వస్తారు. సినిమా చూశాక కనీసం ఒక రోజైనా ఈ చిత్రం మైండ్ లో అలా నిలిచిపోతుంది. మ్యూజిక్, డైలాగ్ లు, లొకేషన్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి’ అని చెప్పింది.

  • Loading...

More Telugu News