: తెలంగాణలో ఏడుగురు ఐఏఎస్ ల బదిలీలు
తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు ఐఏఎస్ లకు స్థాన చలనం జరిగింది. ఆయా బదిలీల వివరాలు.. టీఎస్ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ గా ప్రదీప్ చంద్ర, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బీఆర్ మీనా, నీటి పారుదల శాఖ కార్యదర్శిగా వికాస్ రాజ్, పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీగా శ్రీధర్, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ సీఈఓగా పౌసుమిబసు, కరీంనగర్ జిల్లా జేసీగా ఎ.శ్రీదేవసేన, సీసీఎల్ఏ కార్యదర్శిగా కెకె సూదంరావును బదిలీ చేశారు.