: పుష్కరాల్లోగా దుర్గ గుడి ఫ్లై ఓవర్ ను సిద్ధం చేయలేం: చంద్రబాబు
ఆగస్టులో కృష్ణా పుష్కరాలు పూర్తయ్యే నాటికి కనకదుర్గమ్మ గుడి వద్ద నిర్మాణ దశలో ఉన్న ఫ్లై ఓవర్ సిద్ధమయ్యే పరిస్థితి కనిపించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పుష్కరాలకు వచ్చే యాత్రికులకు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ రహదారులను ఈ లోగా సిద్ధం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా, దుర్గ గుడి వద్ద పై వంతెనను పుష్కరాల నాటికి రెడీ చేయాలన్న లక్ష్యంతో పనులు ప్రారంభం కాగా, ఆక్రమణల తొలగింపు ఆలస్యం కావడం, వర్షాలు కురవడం తదితర కారణాలతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికి ఇంకా పలు పిల్లర్లపై కాంక్రీట్ స్లాబ్ లేకపోవడం కనిపిస్తోంది. అప్రోచ్ వాల్స్ సైతం నిర్మించలేదు. ఈ నేపథ్యంలోనే పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చని తెలుస్తోంది.