: ‘జక్కన్న’గా నవ్వుల్లో ముంచెత్తుతాను: హీరో సునీల్


‘జక్కన్న’గా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతానని హీరో సునీల్ అన్నాడు. ఈరోజు రెడ్ ఎఫ్ ఎం స్టూడియోలో సందడి చేశాడు. తాను నటించిన తాజా చిత్రం ‘జక్కన్న’ తొలి పాటను ఈ సందర్భంగా విడుదల చేశాడు. అనంతరం సునీల్ మాట్లాడుతూ, ఇన్నాళ్లు తన హాస్యానికి దూరమైన ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతానని, కడుపుబ్బ నవ్విస్తానని చెప్పాడు. ఆకెళ్ల వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్ సరసన మన్నారాచోప్రా నటిస్తోంది.

  • Loading...

More Telugu News