: రూ.20కే స్మార్ట్ ఫోన్లో 100 టీవీ చానళ్లు


దేశంలో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని క్యాష్ చేసుకునేందుకు కంపెనీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. వినోద రంగంలో అతిపెద్ద కంపెనీగా ఉన్న జీ గ్రూపు డిట్టో టీవీ పేరుతో స్మార్ట్ ఫోన్ యూజర్లకు తక్కువ ధరకే టీవీ చానళ్ల ప్రసారాలను అందించేందుకు ముందుకు వచ్చింది. నెలకు 20 రూపాయలకే 100కు పైగా టీవీ చానళ్ల ప్రసారాలను అందుకోవచ్చు. దేశంలో 14.5కోట్ల టెలివిజన్లు ఉండగా... అంతకు ఎన్నో రెట్లు స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉన్న విషయాన్ని కంపెనీలు గుర్తించాయి. జీ గ్రూపు సిటీ కేబుల్, ఐడియా సెల్యులర్ నెట్ వర్క్ లతో భాగస్వామ్యం కుదుర్చుకుని డిట్టో టీవీ ప్రసారాలను అందిస్తోంది. డిట్టో టీవీ చానల్ నెలవారీ చందా 20 రూపాయలుగా కంపెనీ ప్రకటించింది. ఐడియా 3జీ, 4జీ చందాదారులు నెలవారీ డేటా ప్యాక్ తో ఉచితంగా డిట్టో టీవీ చందాదారులుగా చేరేందుకు అవకాశం కల్పిస్తోంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్ ఫామ్ లపై డిట్టో టీవీ అందుబాటులో ఉంచినట్టు జీ గ్రూపు ప్రకటించింది. మూడు నెలలకు రూ. 50, ఆరు నెలలకు రూ.90, ఏడాది చందా రూ.170గా తెలిపింది. డిట్టో టీవీ యాప్ ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా టీవీ ప్రసారాలను చూసుకోవచ్చని కంపెనీ అంటోంది.

  • Loading...

More Telugu News