: బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో భారీ కొండచిలువ... మీరూ చూడండి!


ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో... ఓ భారీ కొండచిలువ జనారణ్యంలోకి ప్రవేశించి రోడ్లు, భవనాలు దాటింది. హైదరాబాద్ లో పగలూ, రాత్రి తేడా లేకుండా అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్ లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించింది. దాదాపు 10 అడుగులకు పైగా పొడవున్న దీన్ని చూసిన పోలీసులు సైతం భయపడి పరుగులు తీశారు. అధికారులు ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీకి విషయాన్ని వెల్లడించడంతో సొసైటీ సభ్యులు వచ్చి, దాన్ని చాకచక్యంగా పట్టుకొని తీసుకువెళ్లారు. దీన్ని అడవుల్లో వదిలేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News