: తిరుమలలో పది అడుగుల కోడె నాగు... భయంతో పరుగులు తీసిన భక్తులు


తిరుమల కొండపై విష సర్పాలు బుసలు కొడుతున్నాయి. వెంకన్న భక్తులను ప్రాణభయంతో పరుగులు పెట్టిస్తున్నాయి. ఇటీవలి కాలంలో కొండపై పాములు ప్రత్యక్షమవుతున్న ఘటనలు తరచుగా నమోదువుతున్నాయి. నిన్న కూడా ఓ పది అడుగుల కోడె నాగు దోసెడంత పడగ విప్పి భక్తులను భయభ్రాంతులకు గురి చేసింది. వివరాల్లోకెళితే... తిరుమల పాపవినాశం మార్గంలో ఉన్న కల్యాణ వేదిక వద్ద ఓ పెద్ద కోడె నాగు ప్రత్యక్షమైంది. దాదాపు పది అడుగుల మేర పొడవుతో దోసెడంత పడగ విప్పిన ఆ పాము బుసలు కొట్టింది. దీంతో కల్యాణ వేదిక లోపల ఉన్న భక్తులంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. వెంటనే స్పందించిన టీటీడీ ఉద్యోగులు పాములు పట్టడంతో నిష్ణాతుడిగా పేరున్న భాస్కర్ నాయుడును అక్కడికి రప్పించారు. చాకచక్యంగా పామును పట్టేసిన భాస్కర్ నాయుడు దానిని గోనె సంచిలో వేసి, పాపవినాశం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News