: ప్రముఖ సినీ నటుడు జేవీ రమణమూర్తి కన్నుమూత


అనారోగ్య సమస్యలతో సినీ నటుడు జేవీ రమణమూర్తి(84) కన్నుమూశారు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, ప్రముఖ నటుడు జేవీ సోమయాజులు తమ్ముడు అయిన రమణమూర్తి 1957లో ‘ఎమ్మెల్యే’ చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు. సుమారు 150 సినిమాల్లో ఆయన నటించారు. మాంగల్యబలం, బాటసారి, మరోచరిత్ర, సిరిసిరిమువ్వ, గోరింటాకు, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, శుభోదయం, ఆకలి రాజ్యం, సప్తపది వంటి పలు హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. జేవీ రమణమూర్తి తన ఇరవయ్యవ ఏట నుంచే స్వీయ దర్శకత్వంలో గురజాడ 'కన్యాశుల్కం' నాటకాన్ని ప్రదర్శించారు. ఏకధాటిగా 43 ఏళ్ల పాటు వెయ్యిసార్లు ఆయన దానిని రంగస్థలంపై ప్రదర్శించారు. గిరీశం పాత్రకు ఆయన ప్రఖ్యాతి గాంచారు.

  • Loading...

More Telugu News