: ఈ ‘జూ’ ప్రత్యేకతే వేరు... బయట జంతువులు... బోనులో సందర్శకులు!


చైనాలోని చొంగ్ కొంగ్ లో 'లెహెలెదు' అనే వైల్డ్ లైఫ్ జూ ఒకటి ఉంది. ఇక్కడ సింహాలు, పులులు, ఎలుగుబంట్లు వాటి ఇష్టానుసారం, అడవిలో తిరిగినట్లే ఇక్కడ కూడా తిరుగుతుంటాయి. ఈ జంతువులు స్వేచ్ఛగా విహరిస్తుంటే వాటిని చూసేందుకు వచ్చే సందర్శకుల పరిస్థితి ఏమిటనే అనుమానం తలెత్తకమానదు. జూ అధికారులు ఇక్కడే ఒక ట్విస్ట్ పెట్టారు. సాధారణంగా ఏ జూలో నైనా జంతువులను బోనులో ఉంచుతారు. కానీ, ఇక్కడి పరిస్థితి వేరు. సందర్శకులను బోను అమర్చిన వాహనంలోకి ఎక్కించి తిప్పుతారు. ఆ బోను లోంచి అతి దగ్గరగా సింహాలు, పులులను చూస్తూ సందర్శకులు ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, సందర్శకులు ఉన్న బోను దగ్గరకు వచ్చే జంతువులకు ఆహారం అందజేసే సదుపాయం కూడా జూ నిర్వాహకులు కల్పించారు. దీంతో ఆ జూకు వచ్చే సందర్శకుల సంఖ్య పెరిగిపోతోందట.

  • Loading...

More Telugu News