: అగ్రిగోల్డ్ కేసు సీబీఐకి అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరిన హైకోర్టు
అగ్రిగోల్డ్ కేసు సీబీఐకి అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయాన్ని హైకోర్టు కోరింది. ఈ కేసు విచారణ ఈరోజు జరిగింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో, ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేయాలని హైకోర్టు సూచించింది. కేసు తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. కాగా, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ఖర్చుల నిమిత్తం రూ.25 లక్షలను డిపాజిట్ చేయాలన్న కోర్టు ఆదేశాలను యాజమాన్యం అమలు చేయకపోవడంపై హైకోర్టు మండిపడింది. తదుపరి విచారణ నాటికి ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశించింది.