: ఎల్బీనగర్ రంగారెడ్డి కోర్టు వద్ద న్యాయవాదుల ఆందోళన.. అరెస్ట్
ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని లాయర్లు మరోసారి ఈరోజు ఆందోళనకు దిగారు. ప్రత్యేక హైకోర్టు కోరుతూ, జడ్జిల ఆప్షన్లను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన పలువురు న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేసి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లాయర్ల ఆందోళనతో కోర్టు వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించారు.