: మెడికోలను మోసం చేసిన లారెన్స్ స్నేహితుడు... లారెన్స్ ను రెండు గంటలు విచారించిన క్రైమ్ బ్రాంచ్!


హీరో, డ్యాన్స్ డైరెక్టర్, డైరెక్టర్ గా దక్షిణాదికి సుపరిచితమైన లారెన్స్ ను చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెండు గంటలకు పైగా విచారించారు. ఆయన స్నేహితుడు, వేందర్ మూవీస్ అధినేత మదన్, వైద్య విద్యార్థులను మోసం చేసి పరారైన కేసులో లారెన్స్ ను విచారించినట్టు తెలుస్తోంది. మదన్ ప్రస్తుతం పరారీలో ఉండగా, గత 25 రోజుల నుంచి ఆయన ఆచూకీ తెలుసుకోవడంలో విఫలమైన పోలీసు యంత్రాంగం, మదన్ ఇద్దరు భార్యలను, తల్లినీ విచారించారు. ఆపై లారెన్స్ ను స్టేషనుకు పిలిపించి ఇంటరాగేట్ చేశారు. విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తానంటూ, కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు మదన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆఫీసుల్లో పోలీసులు జరిపిన సోదాల్లో భారీ ఎత్తున బ్యాంకు డ్రాఫ్ట్ లు వెలుగు చూడటం అటు చిత్ర పరిశ్రమలో, ఇటు విద్యా శాఖలో కలకలానికి కారణమైంది.

  • Loading...

More Telugu News