: రాబర్ట్ వాద్రాకు మరో దెబ్బ!... స్కైలైట్ హాస్పిటాలిటీకీ ఈడీ తాఖీదులు!


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. వాద్రా నేతృత్వంలోని ‘స్కైలైట్ హాస్పిటాలిటీ’కి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిన్న నోటీసులు జారీ చేసింది. సంస్థకు చెందిన ఆర్థిక కార్యకలాపాలకు చెందిన సమాచారాన్ని అందజేయాలంటూ ఆ నోటీసుల్లో ఈడీ అధికారులు వాద్రా సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలో గతంలో వాద్రా 110 ఎకరాల (275 బిఘాల) భూమిని కొనుగోలు చేశారు. స్కైలైట్ హాస్పిటాలిటీ పేరిటే ఈ భూమిని కొనుగోలు చేయగా, అందుకు వినియోగించిన డబ్బుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో స్థానిక తహశీల్దార్ చేసిన ఫిర్యాదుతో ఆ రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత నెలలో ఈడీ ఈ స్కైలైట్ లో ముమ్మర సోదాలు చేయడమే కాకుండా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. తాజాగా మరిన్ని పత్రాలు సమర్పించాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News