: రోడ్డుపైనే ప్రసవించిన ముజఫర్ నగర్ బాధితురాలు.. వైద్యుల నిర్లక్ష్యమే కారణం


నిండు గర్భిణి అయిన ముజఫర్ నగర్ బాధితురాలిని ఆస్పత్రి సిబ్బంది చేర్చుకునేందుకు నిరాకరించడంతో రోడ్డుపైనే ప్రసవించింది. ఘటనపై సర్వత్ర నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దీంతో ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) విచారణకు ఆదేశించారు. 2013లో ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చెలరేగిన అల్లర్ల కారణంగా ఓ మహిళ తన సొంత ఊరైన ఫుగానా నుంచి కండాలా పట్టణంలోని పునరావాస కేంద్రానికి చేరుకుంది. ఇటీవల గర్భం దాల్చిన ఆమె నెలలు నిండటంతో కండాలాలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంది. ప్రసవానికి ఇంకా రెండుమూడు రోజుల సమయం ఉందని చెప్పిన వైద్యులు ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆమె భర్తతో కలిసి స్వగ్రామానికి వెళ్తుండగా రోడ్డుపైనే ప్రసవించింది. అనంతరం ఆమెను షామ్లి జిల్లాలోని ఆస్పత్రికి తరలించారు. మహిళను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించిన వైద్యులపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని సీఎంవో తెలిపారు.

  • Loading...

More Telugu News