: గన్ పార్క్ కు అంజయ్య భౌతికకాయం
ప్రజాకవి గూడ అంజయ్య భౌతికకాయాన్ని గన్ పార్క్ కు తరలించనున్నారు. గన్ పార్క్ లో నివాళులర్పించిన అనంతరం అంజయ్య భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామానికి బంధువులు తీసుకువెళతారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ లో అంజయ్య అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. కాగా, గూడ అంజయ్య మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ, తెలంగాణ రచయితల వేదిక తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.