: ‘బ్రహ్మోత్సవం’పై రసమయి బాలకిషన్ సెటైర్... మహేష్ ఫ్యాన్స్ ఫైర్!
టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక వారధి రసమయి బాలకిషన్ వ్యాఖ్యల పై ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రంపై ఆయన సెటైర్లు వేయడమే ఇందుకు కారణం. తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటానని.. ఇటీవల ‘బిచ్చగాడు’ సినిమా చూశానని, ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బ్రహ్మోత్సవం జరుపుకుంటుంటే, మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ మాత్రం బాక్సాఫీసు వద్ద బిచ్చగాడిగా మిగిలిపోయిందని బాలకిషన్ వ్యాఖ్యలు చేశారు. దీంతో, మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.