: బోర్డు పరిధి, నీటి యాజమాన్యంపై కుదరని ఏకాభిప్రాయం
ఢిల్లీలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం కొనసాగుతోంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సుదీర్ఘంగా ఈ సమావేశం సాగుతోంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో జలాల వినియోగంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. బోర్డు పరిధి, నీటి యాజమాన్యంపై ఏకాభిప్రాయం కుదరనట్లు తెలుస్తోంది.