: తెలంగాణ ఉద్యమంలో ప్రజలను కదిలించిన అంజన్న పాట: రసమయి బాలకిషన్
తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం, ‘ధూంధాం’ లు నిలబడటానికి కారణం అంజన్న రాసిన పాటలే కారణమని తెలంగాణ సాంస్కృతిక వారధి, రసమయి బాలకిషన్ అన్నారు. గూడ అంజయ్య మృతిపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంజయ్యతో నాటి జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. అంజయ్య మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు కలకాలం గుర్తుండిపోతాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను ఎక్కువగా పాడిన పాట, ప్రజలను కదిలించిన పాట, తెలంగాణ విజయంలో అత్యంత కీలకమైన పాట ‘ఎనుకముందు చూసుడేంది రాజన ఓ రాజన....’ అని బాలకిషన్ అన్నారు.