: ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట ఆర్.కృష్ణ‌య్య ఆధ్వ‌ర్యంలో నిరుద్యోగుల ధ‌ర్నా


హైదరాబాద్‌లోని ఏపీపీఎస్సీ కార్యాల‌యం ముందు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణ‌య్య ఆధ్వ‌ర్యంలో నిరుద్యోగులు ధ‌ర్నాకు దిగారు. గ్రూప్ ప‌రీక్ష‌ల్లో అనుస‌రించ‌ద‌లచిన ప‌లు అంశాల‌పై వారు తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేశారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలను విడివిడిగా నిర్వహించాలని వారు నినాదాలు చేశారు. ఇంటర్వ్యూ విధానాన్ని కూడా రద్దు చేయాల్సిందేన‌ని వారు డిమాండ్ చేశారు. అవినీతికి అవ‌కాశం ఉండే ఈ విధానాన్ని ర‌ద్దు చేయాల‌ని అన్నారు. ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవుతోన్న విద్యార్థుల‌కు అనుగుణంగా నిబంధ‌న‌లు సడ‌లించాల‌ని, అన్ని ప‌రీక్ష‌ల‌ను ఒకేసారి నిర్వ‌హించే ప‌ద్ధ‌తి తమకొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News