: గూడ అంజయ్య మృతిపై కేసీఆర్ సంతాపం
ప్రముఖ కవి, రచయిత గూడ అంజయ్య మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అంజయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక సామాజిక అంశాలపై అంజయ్య గేయాలు రాశారని, తెలంగాణ సమాజానికి ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరవలేమని కేసీఆర్ అన్నారు. కాగా, అంజయ్య స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపురం. అంజయ్య తల్లిదండ్రులు లక్ష్మయ్య, లక్ష్మమ్మ.