: మరోసారి చైనా పర్యటనకు బాబు... 26 నుంచి నాలుగు రోజులు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి చైనాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ కొద్దిసేపటి క్రితం ఖరారైంది. ఈ నెల 26వ తేదీ ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు ఆయన చైనాలో పర్యటిస్తారని సాధారణ పరిపాలనా శాఖ వెల్లడించింది. 29వ తేదీ వరకూ చంద్రబాబు చైనాలో పర్యటించనుండగా, ఆయన వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ లు సహా 13 మంది వెళతారని అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా చైనా ప్రభుత్వ అధికారులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో బాబు బృందం భేటీ అవుతుందని తెలిపారు.