: ఒత్తిడితో ముందురోజు నిద్రపోలేదు: రెండో టీ20 అర్ధ సెంచరీ హీరో మన్ దీప్ సింగ్


జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 ముందు రోజు నిద్రపోలేదని అర్థ సెంచరీతో రాణించిన మన్ దీప్ సింగ్ తెలిపాడు. మ్యాచ్ లో విజయం సాధించిన అనంతరం మన్ దీప్ సింగ్ మాట్లాడుతూ, తొలి టీ20లో ఓటమి ఒత్తిడి, తన ఆటతీరును సెలెక్టర్లు గమనిస్తున్నారన్న ఆలోచన తనను నిద్రపట్టనీయలేదని అన్నాడు. మ్యాచ్ గెలుస్తామా? సిరీస్ గెలుచుకుంటామా? అనే ఆందోళనతో రాత్రంతా గడిపానని చెప్పాడు. తెల్లవారిన తరువాత గ్రౌండ్ లో అడుగుపెట్టి తొలి బంతి ఎదుర్కొనేంత వరకు ఈ ఒత్తిడి అలాగే ఉందని, తొలి బంతిని ఎదుర్కోగానే ఒత్తిడంతా దూదిపింజలా ఎగిరిపోయిందని అన్నాడు. తొలి టీ20లో ఓటమి తమను చాలా బాధించిందని మన్ దీప్ తెలిపాడు.

  • Loading...

More Telugu News