: విమానంలో విచిత్రంగా ప్రవర్తించిన హాలీవుడ్ నటి
‘క్రుయల్ ఇంటెన్షన్, ది యాంగర్ మేనేజ్ మెంట్’ వంటి హాలీవుడ్ సినిమాల్లో నటించిన నటి సెల్మా బ్లెయిర్(43) విమానంలో విచిత్రంగా ప్రవర్తించింది. తన కుమారుడితో కలసి విమానంలో మెక్సికో నుంచి లాస్ ఏంజెలెస్ ప్రయాణిస్తోన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆమె వైన్లో ఏవో మందులు కలుపుకొని తాగింది. తరువాత తనను ఒకతను కొడుతున్నారని, తనను తాగనివ్వట్లేదని, అంతేగాక తనను చంపాలని చూస్తున్నాడంటూ ఆమె అరుపులు పెట్టింది. ఆమె విచిత్రంగా ప్రవర్తిస్తుండడంతో ప్రయాణికులు బిత్తరపోయారు. వింతగా ప్రవర్తిస్తోన్న ఆమెను లాస్ ఏంజిల్స్ ఎయిర్పోర్టులో నుంచి ఆసుపత్రికి తరలించారు. ఆమె వైన్లో కలుపుకొని తాగిన మందుల ప్రభావమే ఆమె అరుపులు పెట్టడానికి కారణమా..? అనే అంశాన్ని డాక్టర్లు పరిశీలించారు. ఆమెతో ఉన్న బ్యాగుని చెక్ చేశారు. ఆమె వైన్లో ఏ మందు కలుపుకుందన్న అంశాన్ని పరిశీలించారు. సెల్మా బ్లెయిర్ ఏదైనా సైకలాజికల్ సమస్యతో బాధ పడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.