: ఉత్తమ్, కోమటిరెడ్డి కొట్టుకుంటుంటే చూడలేక టీఆర్ఎస్ లో చేరా: గుత్తా


కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలను చూసి తట్టుకోలేకనే తాను పార్టీని మారానని ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిత్యమూ తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఉంటుంటే చూడలేకపోయానని, అందువల్లే పార్టీని వీడానని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలెవరికీ తనను విమర్శించే అర్హత లేదన్నారు. బంగారు తెలంగాణ ఆవిర్భావం కేసీఆర్ ఒక్కడివల్లనే సాధ్యమవుతుందని తాను మనస్ఫూర్తిగా నమ్మినట్టు గుత్తా వెల్లడించారు.

  • Loading...

More Telugu News