: తప్పుగా మాట్లాడా... మన్నించండి: సల్మాన్ ఖాన్
'సుల్తాన్' చిత్రం షూటింగ్ లో భాగంగా కుస్తీ దృశ్యాల చిత్రీకరణ తరువాత, అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితిని తాను అనుభవించానని వ్యాఖ్యానించి, నెటిజన్లు, మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న సల్మాన్ ఖాన్, వెంటనే దిగొచ్చాడు. తన వ్యాఖ్యల తీవ్రత ఎలాంటిదో తెలుసుకున్న ఆయన, తప్పును ఒప్పుకున్నాడు. తాను తప్పుగా వ్యాఖ్యానించానని, ఇవి కావాలని చేసినవి కాదని చెప్పిన సల్మాన్, తనను మన్నించాలని కోరాడు. తానీ వ్యాఖ్య చేసుండాల్సింది కాదని అన్నాడు. ఈ వివాదానికి స్వస్తి చెప్పాలని, తనకు మహిళలంటే అత్యంత గౌరవమని చెప్పాడు.