: యోగా కులానికో, మ‌తానికో ప‌రిమిత‌మ‌యింది కాదు: చ‌ంద్ర‌బాబు


ప్ర‌పంచ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్ర‌భు, ప‌లువురు మంత్రుల‌తో క‌ల‌సి పాల్గొని, యోగాస‌నాలు వేశారు. అక్క‌డి ఎ - కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగింది. అనంత‌రం చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో యోగాను ప్రవేశపెడతామని తెలిపారు. యోగాతో ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని ఆయన అన్నారు. యోగా కులానికో, మ‌తానికో ప‌రిమితమ‌యింది కాదని ఆయన వ్యాఖ్యానించారు. మంచి జీవన విధానాన్ని కొన‌సాగించ‌డానికి యోగా ఉప‌క‌రిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. యోగాకు భవిష్యత్లో మరింత ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు. ‘యోగా ఒక్కరోజు చేసేది కాదు.. జీవితంలో భాగస్వామ్యం కావాల’ని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News