: 'సాక్షి'ని మేము ఆపలేదు... ఏపీ ప్రభుత్వం!


సాక్షి టెలివిజన్ చానల్ ప్రసారాలను నిలిపివేయాలని ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆదేశాలనూ ఇవ్వలేదని, ప్రభుత్వ తరఫు న్యాయవాది కొద్ది సేపటి క్రితం హైకోర్టుకు తెలిపారు. తమ చానల్ ప్రసారాలను అక్రమంగా నిలిపివేశారని ఆరోపిస్తూ, సాక్షి టీవీ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించగా, నేడు విచారణ జరిగింది. తమ నుంచి ఎంఎస్ఓలకు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని, ప్రసారాలు ఆపాలని సూచించ లేదని న్యాయవాది కోర్టుకు వెల్లడించగా, అదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశిస్తూ, కేసును వచ్చే వారానికి వాయిదా వేశారు. కాగా, తుని అరెస్టుల పర్వం మొదలైన తరువాత సాక్షి టీవీ, అవే కథనాలను పదే పదే ప్రసారం చేసి, ప్రజల్లో అలజడిని పెంచుతుందని ఆరోపిస్తూ, ఏపీలో సాక్షి ప్రసారాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎంఎస్ఓలు సైతం ప్రకటించారు.

  • Loading...

More Telugu News