: విడుదలకు ముందే నెట్ లో ప్రత్యక్షమైన తమిళ చిత్రం... నిర్మాతల గగ్గోలు!


'ఉడ్తా పంజాబ్' చిత్రం విడుదలకు ముందే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమై కలకలం సృష్టించిన ఘటన మరువకముందే ఓ తమిళ చిత్రం ఆన్ లైన్లో ప్రత్యక్షమైంది. హీరో జీవీ ప్రకాష్ కుమార్ నటించిన తాజా చిత్రం 'ఉనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు' విడుదలకు ముందే నెట్ లో రావడంపై చిత్రం యూనిట్ చెన్నై పోలీస్ కమిషనర్ టీకే రాజేంద్రన్ కు ఫిర్యాదు చేసింది. సినిమాను నెట్ లో పెట్టిన వారెవరో కనుక్కొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసును నమోదు చేసుకున్న కమిషనర్, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, సంగీత దర్శకుడిగా రాణించిన ప్రకాష్ కుమార్, హీరోగా ఈ చిత్రం రూపొందింది.

  • Loading...

More Telugu News