: పంజాబీ రాదు... పంజాబీ పాటలతోనే ఫేమస్ అయ్యాను: కనికా కపూర్
సినిమాలో కనికా కపూర్ పంజాబీ పాట పాడిందంటే అది హిట్టు కావాల్సిందేనని బాలీవుడ్ అభిమానులు పేర్కొంటారు. ఆమె పాటలు అంత ప్రజాదరణ పొందాయి. దీంతో ఆమెను అంతా పంజాబీ గాయని అని భావిస్తుంటారు. అయితే వాస్తవానికి తాను పంజాబీని కాదని, తనకు అసలు పంజాబీయే రాదని కనికా కపూర్ తెలిపింది. ఉత్తరప్రదేశ్ లోని ఖత్రి తన స్వస్థలమని చెప్పిన కనిక, పంజాబీ ఎలా పలకాలో తెలుసుకుని పాడుతున్నానని, తన పాటలు అందర్నీ అలరించడం తనకు ఆనందంగా ఉందని చెప్పింది. 'ఉడ్తా పంజాబ్' లో ఆమె పాడిన 'దాదా దాసే' పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడింది.