: ఎయిర్ ఫోర్స్ వన్ కు దీటుగా తయారవుతున్న ఎయిర్ ఇండియా వన్!


ఎయిర్ ఫోర్స్ వన్... అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే అత్యంత అధునాతన విమానం. దీనిలోని ప్రత్యేకతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆత్యాధునిక రక్షణ వ్యవస్థ, ప్రపంచంలోని ఏ ప్రాంతంపైనైనా ఆటోమేటిక్ గా దాడులు చేయగల సిస్టమ్, యూఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నియంత్రణా వ్యవస్థ ఇందులో ఉంటాయి. ఎలాంటి క్షిపణి దాడులనైనా అత్యంత తేలికగా తప్పించుకుంటుంది. అవసరమని భావిస్తే, ఎలాంటి రాడార్లకూ చిక్కదు. ఇక అటువంటి విమానాన్నే ప్రధాని మోదీ కోసం ఎయిర్ ఇండియా తయారు చేయిస్తోంది. ఇండియా టుడే గ్రూప్ ప్రత్యేక కథనం ప్రకారం, బోయింగ్ 777-300 మోడల్ విమానాన్ని తీర్చిదిద్ది సరికొత్త ఎయిర్ ఇండియా వన్ (భారత ప్రధాని ప్రయాణించే విమానం పేరు) తయారవుతోంది. ఇందుకు సంబంధించిన డీల్ ను 25వ తేదీన బోయింగ్ అధికారులతో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కుదుర్చుకోనున్నారు. హైటెక్ సెక్యూరిటీ ఎక్విప్ మెంట్, లేటెస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇందులో ఉంటాయి. గ్రనేడ్, రాకెట్ దాడులను తప్పించుకుంటుంది. శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా ప్రయాణిస్తుంది. యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ తో పాటు, 2 వేల మందికి సరిపడా ఆహారం, గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సదుపాయంతో ఉంటుంది. ఓ ఆపరేటింగ్ థియేటర్, ఎలాంటి శస్త్రచికిత్సలనైనా చేయగలిగే వైద్యులు ఉంటారు. బ్రాడ్ బ్యాండ్, టెలికాం కనెక్షన్లు ఎలాగూ ఉంటాయి. ఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్, బెడ్ రూం, నలుగురు పైలెట్లకు సరిపడా వసతి సౌకర్యాలతో తయారవుతుంది. కాగా, ఎయిర్ ఇండియా వన్ ను భారత వాయుసేన న్యూఢిల్లీలోని పాలెం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 8 మంది పైలట్లు ఎయిర్ ఇండియా వన్ కోసమే నిత్యమూ సిద్ధంగా ఉంటారు. విమానంలోని ప్రతి అణువును ప్రతి రోజూ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తనిఖీలు చేస్తుంటుంది. ప్రస్తుతం బోయింగ్ 747-400 రకం విమానం ఎయిర్ ఇండియా వన్ గా సేవలందిస్తుండగా, ఇదే తరహా విమానాన్ని ఉక్రెయిన్ లో కూల్చివేసిన నేపథ్యంలో కొత్త విమానం తయారు చేయించాలని రక్షణ శాఖ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News