: ట్రంప్ ను హత్య చేసేందుకు ఏడాదిగా ప్లాన్, పలు చోట్ల విఫలమైన మైఖేల్!


లాస్ వెగాస్ లో పోలీసు నుంచి తుపాకీ లాక్కోబోయి ట్రంప్ పై హత్యాయత్నం చేసిన మైఖేల్ స్టాన్ ఫోర్డ్, గత ఏడాదిన్నరగా అమెరికాలో ఉంటున్నాడని, ఎన్నోసార్లు ఆయన్ను చంపాలని ప్రయత్నించాడని ఫెడరల్ అధికారులు వెల్లడించారు. సంవత్సరం నుంచి ట్రంప్ ప్రచారం చేస్తున్న పలు ర్యాలీలకు వెళ్లి, అక్కడ విఫలమయ్యాడని తెలిపారు. బక్కపలచగా, చూడటానికి అమాయకంగా కనిపించే మైఖేల్, హోబోకెన్, న్యూజర్సీ, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో తిరిగాడని అధికారులు పేర్కొన్నారు. సొంతంగా తుపాకీని తెస్తే, పోలీసుల ఫ్రిస్కింగ్ లో భాగంగా దొరికి పోతానన్న భయంతోనే పోలీసు నుంచి లాక్కోవాలని ముందే ప్రణాళిక రచించుకున్నాడని వివరించారు. జాకబ్ అనే భద్రతాధికారి వద్ద అన్ లాక్ చేసున్న గన్ చూసి దాన్ని తీసుకుంటే సులువుగా కాల్పులు జరపవచ్చని భావించాడని, ఈ క్రమంలో తన ప్లాన్ విఫలమై దొరికిపోయాడని తెలియజేశారు.

  • Loading...

More Telugu News