: మోదీజీ.. మీ ఫైట్ నాతోనని ఒప్పుకున్నందుకు సంతోషం: కేజ్రీవాల్ విసుర్లు


ఆమ్ ఆద్మీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. ట్యాంకర్ స్కాంలో కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం ట్విట్టర్ లో మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు సంతోషం. దీనిని స్వాగతిస్తున్నా. ఆయన(ప్రధాని) పోరాటం నేరుగా నాతోనే’’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రాలను వదిలి తనపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. సీబీఐ, ఏసీబీలతో తనను భయపెట్టలేరన్నారు.‘‘మోదీజీ మీరు రాబర్ట్ వాద్రా, సోనియాగాంధీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయరు. చేయలేరు కూడా. సీబీఐ, ఏసీబీ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఓసారి నాపై సీబీఐతో దాడి చేయించారు కూడా. అయినా ఏం చేయలేకపోయారు. ఇప్పుడేమో నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చాలా సంతోషం. ఇన్నాళ్లకు మీ ఫైట్ నాతోనేనని అంగీకరించారు’’ అని వరుస ట్వీట్లలో ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News