: వినూత్న ఆలోచన.. ఇంటర్వ్యూ లేకుండా లండన్ లో ఉద్యోగం తెచ్చిపెట్టింది!


సృజనాత్మకత మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని నమ్మే వ్యక్తులలో బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల సుముఖ్ మెహతా ఒకడు. మేనేజ్ మెంట్ విద్యార్థి అయిన సుముఖ్ తన రెజ్యూమ్ ను వినూత్నంగా రూపొందించి ఇంటర్వ్యూ లేకుండానే లండన్ లో ఉద్యోగం కొట్టేశాడు. లండన్ కేంద్రంగా పబ్లిష్ అయ్యే జీక్యూ మ్యాగజైన్ లో ఉద్యోగం కోసం సుముఖ్ పంపించిన సీవీ ఆ సంస్థ ఎడిటర్ ను విశేషంగా ఆకర్షించింది. దానిని చూసిన అతను అది చదవను కూడా చదవకుండానే వెంటనే తమ సంస్థలో చేరమంటూ సుముఖ్ కు కబురు పెట్టాడు. ఇంతకీ సుమఖ్ ఏం చేశాడో తెలుసా.. తన సీవీని జీక్యూ మేగజైన్ స్టైల్లో రూపొందించాడు. 20 పేజీలతో అందంగా అచ్చు జీక్యూ మ్యాగజైన్ లా తయారుచేశాడు. ఇందుకోసం అతనికి మూడు వారాలు పట్టింది. తన పూర్తి వివరాలను అందులో పొందుపరిచాడు. అందులో చదువు, హాబీ తదితర వివరాలను రాసుకొచ్చాడు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా పెట్టాడు. అది చూసిన వారు దానిని రెజ్యూమ్ అనుకోరు.. మ్యాగజైన్ అనుకుంటారు. దీనిని చూసి ఆశ్చర్యపోయిన జీక్యూ ఎడిటర్ డైలన్ జోన్స్ వెంటనే వచ్చి ఉద్యోగంలో చేరమని లక్షల్లో ఆఫర్ చేశారు. మనిషిలో దాగున్న సృజనాత్మకతను వెలికి తీయడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని సుముఖ్ నిరూపించాడు.

  • Loading...

More Telugu News